🏠 Home 📍 Covering Siddipet District 502103
Gajwel • Husnabad • Cherial • Dubbak • Thoguta • Mirdoddi • Nangnoor
📰 Siddipet News • Total: 2
🔐 Login to like, bookmark & add your own Siddipet news
#2 • 24 Oct, 04:50 PM 🆕 NEW
3

హైదరాబాద్‌కు నీటి గండం.. పొదుపుగా వాడాలంటూ లౌడ్‌స్పీకర్లతో ప్రచారం

📍 Siddipet 👁️ 3 views

హైదరాబాద్‌లో నీటి సంక్షోభంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో సాధారణం కంటే 27% తక్కువ వర్షపాతం నమోదైందని, 324 మండలాల్లో భూగర్భ జలాలు పడిపోయాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వలు 20% కంటే తగ్గాయని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. నీటిని వృథా చేయవద్దంటూ మణికొండలో స్థానికులు సైకిల్‌పై లౌడ్‌స్పీకర్‌తో ప్రచారం చేస్తున్నారు. 2027 జూలై వరకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

#1 • 24 Oct, 04:44 PM 🆕 NEW
2

తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు

📍 Siddipet 👁️ 3 views

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. ‘ఆర్నబ్’ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ నెల 30 వరకు వానలు కొనసాగే ఆస్కారముందని వెల్లడించింది. ఈ క్రమంలో 27న పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనుండటంతో ఎల్లో అలర్ట్ జారి చేసింది. 28, 29న భద్రాద్రి, ములుగు, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూరుస్తాయని రెడ్ అలర్ట్ ఇచ్చింది. 30న ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

🔐 One Account • One Login • Access All Four Sections
Register once and access all sections. Login or create your account